సూపర్ కాప్ : అత్యవసర సేవలో డాక్టర్ అయిన ట్రాఫిక్ పోలీస్

policeప్రజలకు మరింత చేరువయ్యేలా.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టింది ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ. అది కేవలం ఏర్పాటు కావడం వరకే కాకుండా..ఆచరణలో చూపిస్తున్నారు పోలీసులు. ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండటంతో పాటు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు.

ప్రమాదాలను నివారించడం తో పాటు అనుకోని ప్రమాదం జరిగితే వారికి అంబులెన్స్ కంటే ముందే ప్రధమ చికిత్స చేయాలనే తపన ఇన్ స్పెక్టర్ అంజపల్లి నాగమల్లుది. ఇందులో భాగంగానే బుధవారం (ఏప్రిల్ 11) రాత్రి 10 గంటల సమయంలో వనస్థలిపురం పనామా జంక్షన్ ముందు బైక్ పై హయత్ నగర్ వైపు వెళ్తున్న భార్యాభర్తలను.. ఓ కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న సైదమ్మ(40)తలకు తీవ్ర గాయమైంది. రక్తపు మడుగులో పడి ఉంది. అదే సమయంలో ట్రాఫిక్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు గమనించారు. వెంటనే తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో ప్రథమ చికిత్స చేశారు. రక్త స్రావాన్ని అదుపు చేశారు. తలకు కట్టుకట్టారు. రక్తం ఆగటానికి కావాల్సిన చికిత్సను అందించారు. ఆ తర్వాత స్వయంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చొరవకు స్థానికులు ప్రశంశించారు.

రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తన కమిషనేరట్ పరిధిలోని అన్ని విభాగాల వారికి ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రధమ చికిత్స ఎలా చేయాలో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ శిక్షణను పొందిన వారిలో ఒకరు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.

Posted in Uncategorized

Latest Updates