సూపర్ పవర్ : కర్నాటక షెడ్యూల్ బీజేపీకి ముందే తెలుసా

amit-malviyaకర్నాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. రాజకీయ దుమారాన్ని కూడా లేపింది. మే 12న పోలింగ్.. 15న కౌంటింగ్ అని తెలిపింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈసీ ప్రకటనకి కొన్ని నిమిషాల ముందే.. బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జి అమిత్ మాలవీయ ఓ ట్విట్ చేశారు. కర్నాటక ప్రజలు మే 12న ఓటు వేయబోతున్నారు.. కౌంటింగ్ 18వ తేదీ ఉంటుందని ఆ ట్విట్ సారాంశం. ఈ ట్విట్ తర్వాత ఈసీ ప్రకటన కూడా అచ్చం అలాగే ఉంది. దీంతో మీడియా ఖంగుతిన్నది.

బీజేపీ ఐటీ సెల్ కి ఎన్నికల షెడ్యూల్ ముందే ఎలా తెలిసింది అని ఏకంగా ప్రధాన ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈసీ.. విచారణ చేస్తామని.. తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. లీక్ అయినట్లు తెలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తెలిపింది. కౌంటింగ్ 15వ తేదీ అని ఈసీ ప్రకటిస్తే.. బీజేపీ లీడర్ మాలవీయ మాత్రం 18వ తేదీ ఉంటుందని తెలిపారు. మిగతాది అంతా యథాతథం. సింగిల్ ఫేస్ లో ఓటింగ్ ఉంటుందని బీజేపీకి ఎలా తెలుసు.. మే 12వ తేదీనే పోలింగ్ అని ఎలా తెలిసింది అని కాంగ్రెస్ నేతలు దాడి మొదలుపెట్టారు. ఇది వివాదంగా మారటంతో తన ఖాతా నుంచి ఆ ట్విట్ ను తొలగించాడు మాలవీయ.

Posted in Uncategorized

Latest Updates