సూపర్ ప్యాకేజీ: ప్రాజెక్ట్ కోసం భూములిస్తే కోట్లు వచ్చాయి

Arunachal CM Pema Khandu handing over cheque to one of Bomja villagers in Tawangjpgప్రాజెక్టులకు భూములు ఇవ్వాలంటే ఏ ఒక్క రైతు కూడా అంత సులభంగా ఒప్పుకోడు. నష్టపరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టుల కోసం బలవంతంగా కూడా ప్రభుత్వాలు భూములు లాగేసుకుంటున్నాయి. భూములను ఇచ్చిన ప్రజలు ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ నష్టపరిహారం కోసం తిరగడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అడిగిన వెంటనే ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చి ఆసియాలోనే అత్యంత ధనిక దేశంగా నిలిచింది ఓ గ్రామం. రక్షణ శాఖ అవసరాల కోసం అరుణాచల్ ప్రదేశ్ లోని బోమ్జా అనే గ్రామంలోని 200 ఎకరాలను సేకరించాలని రక్షణశాక భావించింది. ఈ విషయాన్ని ఆ గ్రామస్ధులకు తెలియజేయడంతో వారు కూడా అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఆ గ్రామంలో భూములు కోల్పోయిన 31 కుటుంబాలకు భారీ స్ధాయిలో నష్టపరిహారం అందించింది. దీంతో ఆ గ్రామంలోని అందరూ కోటీశ్వరులయ్యారు. 29 కుటుంబాలకు రూ.1,09,03,813.37 కోట్లు రాగా, ఓ కుటుంబానికి రూ.6,73,29,925.48 కోట్లు రాగా, మరో కుటుంబానికి రూ.2,44,97,886.79 కోట్లు వచ్చాయి. దీంతో వారంతా తాము కోటీశ్వరులమయ్యామని తెగ ఆనందపడిపోతున్నారు.
Bomja-Arunachal-village-named-among-richest-villages-of-Asia

Posted in Uncategorized

Latest Updates