సూరి హత్య కేసు: భానుకిరణ్ కు యావజ్జీవం

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. కారు డ్రైవర్ మన్మోహన్ సింగ్ కు 5 ఏళ్లు  జైలు శిక్ష విధించింది కోర్టు. సరైన ఆధారాలు లేని కారణంగా మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో మొత్తం 117 మంది సాక్షులను కోర్టు విచారించింది.

డ్రైవర్  వాంగ్మూలంతో ఈ కేసులో భానుకిరణ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో భానుతో పాటు ఆరుగురి పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చారు. సూరి గన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ను పరిశీలించిన సీఐడీ.. కార్ డ్రైవర్ వాంగ్మూలంతో పాటు.. కేసులోని ఇతర నిందితులతో భానుకిరణ్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఫైనల్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించింది. ఏడేళ్ల తరువాత ఈ కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో భానుకిరణ్ ఐదేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. 2011లో హైదరాబాద్ లో జరిగిన కాల్పుల్లో మద్దెల చెరువు సూరి చనిపోయాడు.

 

Posted in Uncategorized

Latest Updates