సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

accidentసూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండలో సోమవారం(జూన్-4) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ దగ్గర ఆగి వున్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను సత్యనారాయణ(35), మాధురి(21)గా గుర్తించారు.

సత్యనారాయణకు రావులపాలెంలో ఉంటున్న వాళ్ల అమ్మకు సీరియస్‌గా ఉందని కబురు వచ్చింది. దీంతో ఆయన ఓలా క్యాబ్‌ మాట్లాడుకొని హిమయత్‌నగర్‌ నుంచి తన భార్య సౌజన్య, మరదలు మాధురితో కలిసి రావులపాలెం బయలుదేనట్లు తెలుస్తోంది.

 

Posted in Uncategorized

Latest Updates