సూర్యాపేటలో టాటా ఏసీ బోల్తా..నలుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ ఆదివారం (జూలై-15) లో టాటా ఏస్ ఆటో టైర్ పగిలిపోవడం రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గురుస్వామి, వీరస్వామి, హుస్సేన్ మృతిచెందగా… మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో పరిటాల కొండ (55) చికిత్స పొందుతూ మరణించారు. విషమంగా ఉన్న వారిని విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట దగ్గర జనగాం రోడ్డులోని దండు మైసమ్మకు మొక్కులు చెల్లించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పంక్చర్ కావటం వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates