సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధం : మంత్రి జగదీష్ రెడ్డి

jagadishవేల కోట్ల రూపాయలతో సూర్యాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తామని, ప్రతిపక్షాలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు జగదీష్ రెడ్డి.

గత పాలకులు సూర్యాపేటలో చేసిన అభివృద్ధి శూన్యమని, వచ్చిన నిధులను ఖర్చు పెట్టలేని నాయకులు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవై ఏళ్లల్లో జరగని అభివృద్ధి మూడేళ్లలోనే జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు పరచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు జగదీష్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates