సూర్యాపేట రోడ్డు భవనాల శాఖ కార్యాలయం ఫర్నీచర్ జప్తు

manapuram1902రోడ్డు భవనాల శాఖ డివిజన్ కార్యాలయం ఫర్నీచర్‌ను సోమవారం (ఫిబ్రవరి-19) కోర్టు జప్తు చేసింది. 2005లో తుంగతుర్తి మండలం మానాపురం తండాలో రోడ్డు వేస్తూ పక్కనే ఉన్న వ్యవసాయ బావికి ఆసరాగా ఉన్న గోడను కూల్చి తిరిగి నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఎటువంటి రక్షణ లేని ఆ బావిలో పడి మాలశ్రీ అనే బాలిక మృతి చెందింది.

అందుకు పరిహారం చెల్లించకపోవడంతో మాలశ్రీ కుటుంబ సభ్యులు సూర్యాపేట కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ.. వాళ్లకు ఇంతవరకు పరిహారం అందకపోవడంతో కార్యాలయం ఫర్నీచర్‌ను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కార్యాలయం ఫర్నీచర్‌ను జప్తు చేశారు.

Posted in Uncategorized

Latest Updates