సూర్యాపేట, హుజుర్‌నగర్‌లో డయాలసిస్ సెంటర్లు

lakshma
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రితో పాటు హుజుర్‌నగర్‌లోని ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ సురేందర్ మోహన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఆయన. అలాగే రాష్ట్రంలో 20 ఐసీయూ సెంటర్లను కూడా ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి.

ప్రజలందరూ రోగాల పట్ల అవగాహనతో ఉండాలన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. కలుషిత నీరు, అనవసరపు మందుల ద్వారా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. రోగాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. రోగాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు జగదీశ్ రెడ్డి.

 

Posted in Uncategorized

Latest Updates