సూళ్ల డిజిటలైజేషన్ ప్రారంభించాం: కేటీఆర్

ktrరాష్ట్రంలో సూళ్ల డిజిటలైజేషన్‌ ప్రారంభించామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్  HICCలో మూడో రోజు జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి రాష్ట్రంలో ప్రతి స్కూలు,కాలేజీల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు.

ఆరోగ్య రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. భారత్‌లో తొలిసారి టెలిమెడిసిన్‌ను ఇక్కడే ప్రారంభించామని.. టీ ఫైబర్‌తో ళళ్లు, స్కూళ్లు, PHCను అనుసంధానం చేస్తామని తెలిపారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టార్టప్ స్టేట్‌గా ఎదుగుతోందన్నారు.

రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా చేయవచ్చన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates