పెర్త్ టెస్ట్ : సెంచరీతో కోహ్లీ మరో రికార్డ్

పెర్త్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేశాడు.  ఆస్ట్రేలియాను 326 పరుగులకే  కట్టడి చేసిన భారత్…  172/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది.  తొలి ఓవర్ లోనే రహానే వికెట్ కోల్పోయాడు. ఆసీస్  స్పిన్నర్  నాథన్  లయన్  అద్భుత బంతితో రహానేను బోల్తా కొట్టించాడు. 105 బాల్స్ లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ తో రహానే ( 51) రన్స్ చేశాడు.

క్రీజులోకి వచ్చిన విహారితో కోహ్లీ ఇన్నింగ్స్  కొనసాగించాడు. దీంతో.. తన టెస్ట్ కెరీర్ లో 25వ సెంచరీని కోహ్లీ పూర్తి చేశాడు. 214 బాల్స్ లో 11 ఫోర్లతో కెరీర్ లో 25వ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో వేగంగా 25 సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డులకెక్కాడు. అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నాడు. 76 మ్యాచ్ లు .. 128 ఇన్నింగ్స్ లలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. 81 ఓవర్లలో  భార‌త స్కోరు 4 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు.

కోహ్లీ తరువాత సచిన్ 130 ఇన్నింగ్స్ లో.. గవాస్కర్ 138 ఇన్నింగ్స్ లో 25 సెంచరీలు పూర్తి చేసిన వారిలో ఉన్నారు.  అంతర్జాతీయంగా మాత్రం.. బ్రాడ్ మన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 52 మ్యాచ్ లు.. 68 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించాడు.

Posted in Uncategorized

Latest Updates