సెంచూరియన్‌ టీ20 : భారత్ బ్యాటింగ్

cricketyభారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలి టీ20 గెలిచి ఉత్సాహంగా ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్‌ కోల్పోయిన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ప్రొటీస్‌ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుండగా.. టీమిండియాలో బుమ్రా స్థానంలో యువ బౌలర్‌ శార్ధుల్‌ ఠాకుర్‌ వచ్చాడు.
జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రైనా, మనీశ్‌ పాండే, ధోని, పాండ్యా, భువనేశ్వర్, ఉనాద్కట్, చహల్, శార్ధుల్‌.

దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్, స్మట్స్, మిల్లర్, బెహర్దీన్, క్లాసెన్, మోరిస్, ఫెలుక్‌వాయో, జూనియర్‌ డాలా, డేన్‌ ప్యాటర్సన్, షమ్సీ.

Posted in Uncategorized

Latest Updates