సెంచూరియన్‌ టీ20 : మనీశ్ పాండే హాఫ్ సెంచరీ

pandey
సెంచురియన్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి-21)న సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత ప్లేయర్ మనీశ్ పాండే జోరు కొనసాగిస్తున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. (33 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్లు -నాటౌట్)తో విరుచుకుపడ్డాడు. ఓ క్రమంలో వరుసగా వికెట్లు పడుతుండగా తనదైన స్టైల్లో ఆడి భారత్ కి మంచి స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించాడు. కోహ్లీ (1) ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చని పాండే నిలకడగా ఆడాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీ దాటించాడు. రెండు చక్కని సిక్సర్లు బాదేశాడు. అతడికి ధోనీ (17; 13 బంతుల్లో 1×6) సహకారం అందిస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 124/4తో ఉంది.

Posted in Uncategorized

Latest Updates