సెంచూరియన్‌ టీ20 : సిరీస్ పై కన్నేసిన టీమిండియా

indian-team1సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టీ20లో గ్రేట్ విక్టరీ సాధించిన విరాట్‌ సేన.. బుధవారం(ఫిబ్రవరి-21) సెంచూరియన్‌ లో జరిగే రెండో మ్యాచ్ కి సిద్ధమైంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్ లో 0-1ఆధిక్యంతో ఉన్న టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే విజయంపై భారత్‌ దృష్టి పెట్టింది. సౌతాఫ్రికా మాత్రం సిరీస్‌ ఫలితాన్ని కడవరకూ తీసుకెళ్లాలనే యోచనలో ఉంది. దానిలో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టును కట్టడి చేయడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు తమ ప్రణాళికలో పదును పెడుతూ రెండో టీ 20 సిద్ధమవుతోంది. బుధవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో రాత్రి గం. 9.30 ని.లకు ఇరు జట్ల మధ్య రెండో టీ 20 జరుగనుంది. సఫారీలతో రెండో టీ 20లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆడటంపై సందిగ్థత నెలకొంది.

తొలి టీ20లో మోకాలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో కోహ్లి మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. దాంతో రెండో టీ20లో కోహ్లి పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మ్యాచ్‌ సమయానికి కోహ్లి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. అది చిన్న గాయమే కావడంతో కోహ్లి ఆడటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

సఫారీలకు పరీక్ష

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను దారుణంగా కోల్పోయిన సఫారీలు.. కనీసం ట్వంటీ 20 సిరీస్‌ను దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. దాంతో బుధవారం టీ20 మ్యాచ్‌కు సౌతాఫ్రికా ఒత్తిడితో బరిలోకి దిగుతుంది. గాయాల బారిన సౌతాఫ్రికా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  మరొకవైపు భారత జట్టు సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతుంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతూ సఫారీలను వణికిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య మరో హోరాహోరీ పోరు ఖాయంగానే కనబడుతుంది. మరి టీమిండియా సిరీస్‌ను ఇక్కడే ముగిస్తుందా..లేక సౌతాఫ్రికా కడవరకూ తీసుకెళుతుందా అనేది ఆసక్తికరం.

 

Posted in Uncategorized

Latest Updates