సెంచూరియన్‌ వన్డే : గెలుపే లక్ష్యంగా టీమిండియా

indiసౌతాఫ్రికాతో ఫస్ట్ వన్డే విజయంతో మంచి జోరుమీదున్న టీమిండియా రెండో వన్డేకు సౌ అంటోంది. ఆదివారం ( ఫిబ్రవరి-4) సెంచూరియన్‌ సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌లో సౌతాఫ్రికాతో జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చివరి టెస్టు, తొలి వన్డేలో విజయాల తర్వాత టీమిండియాలో ఉత్సాహం కాణ్పిడెంట్ నింపుగా.. కీలక ఆటగాళ్ల గాయాలతో సొంతగడ్డపై సఫారీ టీమ్‌ తడబాటును ఎదుర్కొంటోంది. ఇలాంటి స్థితిలో భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌పై మరింత పట్టు బిగుస్తుంది.

మార్పులు లేకుండానే…
ఫస్ట్ వన్డేలో టీమిండియా ఆట చూస్తే జట్టులో ఒక్క మార్పుకు కూడా అవకాశం కనిపించదు. కోహ్లిని అడ్డుకోవడం సౌతాఫ్రికా బౌలర్ల వల్ల కావడం లేదు. భారత బ్యాటింగ్‌ వెన్నెముక అయిన కోహ్లిని నిరోధిస్తే విజయావకాశాలు పెరుగుతాయని సౌతాఫ్రికా చెబుతూ వచ్చింది. అదే కారణంగా కోహ్లి క్యాచ్‌ను స్లిప్‌లో పట్టుకునే క్రమంలోనే డివిలియర్స్, డు ప్లెసిస్‌ వేలికి గాయాలతో జట్టుకు దూరం కావడం ఆ జట్టును కలవరపెడుతోంది.  ధావన్, రోహిత్‌ తమదైన శైలిలో ఆడితే భారత్‌కు తిరుగుండదు. తన విలువేంటో రహానే గత మ్యాచ్‌లో చూపించాడు. 10 వేల పరుగులకు చేరువలో ఉన్న ధోని బ్యాట్‌ ఝళిపించేందుకు సిద్ధం. మరో వైపు పేస్‌ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రాల ప్రదర్శనపై ఎలాంటి అనుమానాలు లేవు. ఫస్ట్ మ్యాచ్‌ ప్రదర్శనను బట్టి చూస్తే భారత్‌ మరో ఆలోచన లేకుండా ఇద్దరు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను కొనసాగించడం ఖాయం. మొత్తంగా భారత్‌ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates