సెంచూరియన్‌ వన్డే : జోరుమీదున్న టీమిండియా

DV8RuoUVoAAt5Sgఇరవై ఐదు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సౌతాఫ్రికాతో సిరీస్ ను అందుకున్న టీమిండియా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఆరో వన్డేకు సిద్ధమైంది. శుక్రవారం (ఫిబ్రవరి-16) సెంచూరియన్‌ లో సౌతాఫ్రికా-ఇండియా చివరి ఆరో వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో భాగంగా రెండు జట్లలో ICC వన్డే నంబర్‌ వన్‌ ర్యాంక్‌ ఎవరిదో తేలిపోయింది. అయినా… చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు స్వదేశంలో ఎన్నడూ లేనంతటి పరాభవాన్ని ఎదుర్కొన్న సౌతాఫ్రికా పరువు దక్కించుకునేందుకైనా విజయం సాధించాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి.. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కాన్ఫిడెన్స్ గా వెళ్లాలని కోరుకుంటోంది సౌతాఫ్రికా. మరోవైపు ఆఖరి వన్డేలోనూ భారత్ తన సత్తా చాటలని చూస్తోంది. మ్యాచ్ తో తమ ప్లేయర్ల ఆటతీరుతో వచ్చే వరల్డ్ కప్ లో మరింత కాన్ఫిడెన్స్ గా ఉండొచ్చని కోహ్లీసేన భావిస్తోంది. మరి చూడాలి ఆఖరి వన్డేలో ఇరుజట్ల మధ్యపోరు ఎలా ఉంటుందో.

ఫైనల్ జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రహానే/మనీశ్‌పాండే, అయ్యర్‌/దినేశ్‌ కార్తీక్, ధోని, పాండ్యా, కుల్దీప్‌/అక్షర్, చహల్, షమీ, బుమ్రా/శార్దూల్‌.
సౌతాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలూక్వాయో/మోరిస్, తాహిర్, షమ్సీ, రబడ, మోర్కెల్‌.
పిచ్, వాతావరణం
సెంచూరియన్‌ పిచ్‌ భారత్‌లోని పిచ్‌ల తరహాలో ఉంటుంది. రెండో వన్డేలో 8 వికెట్లు నేలకూల్చి చహల్, కుల్దీప్‌ ఆతిథ్య జట్టును 118 పరుగులకే పరిమితం చేసిందిక్కడే. శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్ధ ఉండటంతో మ్యాచ్‌కు ఎటువంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు.
మ్యాచ్ సా.గం. 4.30 నుంచి సోనీ–టెన్‌ 1, 3లలో లైవ్

Posted in Uncategorized

Latest Updates