సెంచూరియన్ వన్డే: భారత్ టార్గెట్ 119

match (2)సెంచూరియన్ లో సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు 32.2ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ కు 119 పరుగులు టార్గెట్ ను ఇచ్చింది.

సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లు హసీమ్ అమ్లా 23, డికాక్ 20, డుమిని 25, జొన్డో 25, మార్కరమ్ 8 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్లు అంతగా రాణించలేక పోయారు. ఇందులో ముగ్గురు డకౌట్లు కాగా, మరో ఇద్దరు ఒక్కొక్క పరుగులు చేశారు.

భారత్ బౌలర్ చాహల్ 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, బుమ్రాలు చెరొక వికెట్ తీసుకున్నారు. ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Posted in Uncategorized

Latest Updates