సెకండ్ టీ20లో సౌతాఫ్రికా విక్టరీ

South-Africa-Indiaసెంచూరియన్ టీ20లో సౌతాఫ్రికా సత్తాచాటింది. ఫస్ట్ టీ20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా… ఫస్ట్ పవర్ ప్లేలోనే తడబడింది. రెండు మెయిడెన్లు.. మూడు వికెట్లు కోల్పోయి కుదుపుకు లోనైంది. రోహిత్ శర్మ డకౌట్ కాగా… ధవన్, కోహ్లీ ఓవర్ తేడాలో ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ గాడితప్పింది. రైనా-మనీష్ పాండే కలిసి హిట్టింగ్ దిగడంతో 10 ఒవర్లలో 85 రన్స్ చేయగలిగింది.
రైనా ఔటయ్యాక ధోనీతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు మనీష్ పాండే. దాంతో నెక్స్ట్ పది ఓవర్లలో ఏకంగా 103 రన్స్ చేసింది భారత్. పాండే, ధోనీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది భారత్.
189 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన సఫారీ టీం… ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ స్మట్స్, హెన్రిక్స్ 38 రన్స్ కే ఔటైనా.. తర్వాత డుమినీతో కలిసి క్లాసెన్ క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి 8 ఓవర్లలో 93 రన్స్ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. ముఖ్యంగా చాహల్ టార్గెట్ గా క్లాసెన్ రెచ్చిపోయాడు.
చాహల్ బౌలింగ్ లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదారు డుమినీ-క్లాసెన్. దాంతో 4 ఓవర్లలో 64 రన్స్ సమర్పించుకున్నాడు చాహల్. టీ20 హిస్టరీలో అత్యంత చెత్త స్పెల్ ఇది. క్లాసెన్ ని ఉనద్కత్ ఔట్ చేసినా… అప్పటికే సఫారీ వేట పూర్తైంది. చివర్లో మిల్లర్ ఔటైనా.. బెహార్డిన్ తో కలిసి టార్గెట్ ని ఫినిష్ చేసింది సౌతాఫ్రికా. మరో 8 బంతులు మిగిలుండగానే కొట్టేసింది డుమినీ గ్యాంగ్.
సౌతాఫ్రికా విక్టరీతో టీ20 సిరీస్ 1-1తో ఈక్వల్ అయింది. దీంతో శనివారం జరగబోయే థర్డ్ టీ20 కీలకంగా మారింది. మరోవైపు జొహెన్నెస్ బర్గ్ లో సౌతాఫ్రికా-భారత్ మధ్య జరిగిన విమెన్ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

Posted in Uncategorized

Latest Updates