సెక్యూరిటీ అలర్ట్ : మోడీ గారూ.. రోడ్ షోలు తగ్గించండి

bsస్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా ప్రధాని మోడీ దగ్గరకు ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదని, మంత్రులు, అధికారులైనా సరే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG)క్లియరెన్స్ లభించిన తర్వాతనే మోడీ దగ్గరకు వెళ్లాలని హోంశాఖ కొన్ని సూచనలు చేసింది. మోడీకి ఆల్ టైం హై ముప్పు ఉందని హోంశాఖ తెలిపింది. మోడీకి ప్రాణహాని ఉందంటూ అన్ని  రాష్ర్టాల పోలీస్ చీఫ్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. 2019 సాధారణ ఎన్నికల్లో మోడీని చంపేయాలని కొంతమంది టార్గెట్ చేస్తున్నారని, అందువల్ల ప్రధాని భధ్రత దృష్ట్యా సెక్యూరిటీని పఠిష్టం చేయాలని నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ తెలిపింది. ఎన్నికల సమయంలో నిర్వహించే రోడ్ షో లను తగ్గించుకోవాలని మోడీకి సూచించారు. అయితే పూర్తిగా రోడ్ షోలను చేయకపోవడం ఇంకా మంచిదని మోడీకి సూచించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసినట్లుగానే మోడీని చంపడానికి మావోయిస్టులు చేసిన ఫ్లాన్ ను ఇటీవల పౌణే పోలీసులు బయటపెట్టారు. దీంతో అప్పటినుంచి మోడీ భధ్రతపై హోంశాఖ మరింత దృష్టి సారించింది

Posted in Uncategorized

Latest Updates