సెక్యూరిటీ ఎలా : గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్

pawan-kalyanజనసేన అధినేత పవన్ కల్యాణ్…తన గన్ మెన్లను వెనక్కి పంపారు. గత నెలలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు పవన్ కల్యాణ్. స్పందించిన AP సర్కార్.. నలుగురు గన్ మెన్లను కేటాయించింది. అయితే పవన్ తన గన్ మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అంతే కాదు తనకు కేటాయించిన గన్ మెన్లు వద్దని డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు. అయితే గన్ మెన్లను వెనక్కి పంపడంపై కారణాలను వెల్లడించలేదు జనసేన అధినేత.

తన గన్ మెన్లను వెనక్కి పంపించటంపై ఏపీ ప్రభుత్వం కూడా షాక్ అయ్యింది. ఓ పార్టీ అధినేతగా.. సినీ హీరోగా ప్రజల్లోకి వెళితే భద్రత ముఖ్యం అని.. ప్రభుత్వం కల్పించిన భద్రతను వెనక్కి పంపించటం ఏంటని ప్రశ్నిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates