సెటిల్మెంట్ కు రెడీ : లండన్ మీడియాతో విజయ్ మాల్యా

భారత్ కు అప్పగించే కేసులో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. భారత్ లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు 9వేల కోట్లు ఎగవేసి.. లండన్ పారిపోయిన మాల్యాను భారత్ కు అప్పగించే విషయంలో కేసును వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారిస్తోంది. ఎక్స్ ట్రడిషన్ కేసులో తనపై మోపిన ఆరోపణలన్నీ తప్పన్నారు విజయ్ మాల్యా.

మనీ లాండరింగ్, ఉద్దేశపూర్వక ఎగవేత లాంటివి తప్పుడు ఆరోపణలన్నారు. బ్యాంకులతో సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం చెల్లించాల్సింది 9వేల కోట్లు అని.. అయితే ఇండియాలోని విచారణ సంస్థలు 13వేల కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని మీడియాకి తెలిపారు. తన ఆస్తులు అమ్ముకోవటానికి అవకాశం ఇవ్వాలని లేకపోతే.. ప్రభుత్వమే వాటిని అమ్మివేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>London: Vijay Mallya arrives at Westminster court for hearing in extradition case against him; says, &#39;allegations of money laundering &amp; stealing money are completely false&#39; <a href=”https://t.co/hYBZbHTWDD”>pic.twitter.com/hYBZbHTWDD</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/1024214731060600832?ref_src=twsrc%5Etfw”>July 31, 2018</a></blockquote>
<script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Posted in Uncategorized

Latest Updates