సెట్టింగ్ తొలగింపు : సైరా మూవీ షూటింగ్ కి బ్రేక్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్న మూవీ సైరా. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. దీనికి కారణం సెట్టింగ్స్ తొలగించటం. అవును.. అనుమతి లేకుండా సెట్టింగ్స్ వేయటం, షూటింగ్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు. 10 మంది ఆఫీసర్స్ స్పాట్ కు వచ్చారు. సైరా నరసింహారెడ్డి నివసించే ఇంటి సెట్టింగ్ కు ఎలాంటి అనుమతి లేదని.. షూటింగ్ కు పర్మీషన్ తీసుకోలేదని తెలిపారు. ఆ ఇంటి సెట్ ను పడగొట్టారు రెవెన్యూ సిబ్బంది. దీంతో షూటింగ్ నిలిచిపోయింది.

రంగస్థలం మూవీ కోసం వేసిన సెట్ లోనే.. సైరా షూటింగ్ జరుగుతుంది. నిర్మాణ సంస్థ మాత్రం రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతి తీసుకోలేదు. విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు.. షూటింగ్ స్పాట్ కు వెళ్లి పరిశీలించి.. నిర్థారించుకున్నారు. నిబంధనల ప్రకారం సెట్ ను పీకేశారు.

Posted in Uncategorized

Latest Updates