సెట్ లో కేటీఆర్ సందడి : కుమారస్వామి కొడుకు సినిమా

KTRకర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకును హీరోగా పరిచయం చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ బెంగళూరులో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో సందడి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

బెంగళూరులో సీఎం కుమారస్వామిని కలిసిన కేటీఆర్ ను షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లాడట కుమారస్వామి.  ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, హరితహారం తదితర పథకాల గురించి కుమారస్వామితో చర్చించినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు కేటీఆర్. సీఎంతో కలిసి కేటీఆర్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు.

కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్న సినిమా సీతారామ కల్యాణ. ఈ సందర్భంగా కుమారస్వామితో కలిసి కేటీఆర్ సినిమా సెట్‌ కు వెళ్లినట్లు తెలిపిన కేటీఆర్.. సినిమాకి సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.  ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది.

Posted in Uncategorized

Latest Updates