సెమీ ఫైనల్ సమరం : నేడు బెల్జియంతో ఫ్రాన్స్ ఢీ

ఫైనల్ కాని ఫైనల్ ఇది అంటూ ఫ్రాన్స్..బెల్జియం జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్ అంతటా ఆసక్తిని కలిగిస్తున్నది.. రెండుజట్లలోనూ స్టార్ ఆటగాళ్లు నిండి ఉండడంతో  ఈమ్యాచ్‌పై మరింత హైప్ నెలకొంది. అటాకింగ్‌ లో19 ఏండ్ల యువ ఫార్వర్డ్ ఎంబాప్పే ..ఫుల్‌ బాక్స్ డిఫెండర్లుగా 22 ఏండ్ల యువ బెంజిమిన్ పావార్డ్, లుకాస్ హెర్నాండెజ్.. అంతగా అనుభవం లేని వీరి ఆటతీరుతోనే 2006 తర్వాత ఫ్రాన్స్ రెండోసారి సెమీస్‌కు దూసుకొచ్చింది.

మేం ఎవరితో తలపడేందుకైనా రెడీ.. ఏ జట్టులోని ఆటగాడిని చూసి మేం భయపడం అని పావార్డ్ అన్నాడు. ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నామని ఫ్రాన్స్ కోచ్ డిడెయిర్ డెస్చాంప్ పేర్కొన్నాడు. డెస్చాంప్ కెప్టెన్సీలోనే 1998 ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీతో పాటు 2000 యూరో చాంపియన్‌గా నిలువడం విశేషం. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ డెస్చాంప్ ప్రేరణతోనే ఫ్రాన్స్ చెలరేగుతుందని పావార్డ్ స్పష్టం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ైస్ట్రెకర్లలో ఎంబాప్పా 3 గోల్స్ కొట్టాడు. గ్రీజ్‌మాన్ 2 గోల్స్‌తోపాటు జట్టు సాధించిన మరో గోల్‌లో భాగసామ్యంలో పాలుపంచుకున్నాడు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఎంబాప్పే చెలరేగగా.. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో గ్రీజ్‌మాన్ అద్భుతనైపుణ్యంతో జట్టుకు విజయాన్నందించాడు. తాజా విజయాలతో ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ పండితుల కితాబులందుకుంటున్నది. బెల్జియం జట్టును నిలువరించి విజయంతో ఫైనల్ చేరే అవకాశం ఫ్రాన్స్‌కే కనిపిస్తున్నది.

జట్లు అంచనా

ఫ్రాన్స్
హ్యూగో లోరిస్, లుకాస్ హెర్నాండెజ్, సామ్యూల్ యుమిటిటి, రాఫెల్ వారనే, బెంజిమిన్ పావార్డ్, ఎంగోలో కాంటే,
పాల్ పోగ్బా, ైబ్లెసే మాటిడి, ఆంటోనియో గ్రీజ్‌మన్, కైలియాన్ ఎంబాప్పే, ఒలివర్ గిరోడ్.

బెల్జియం
టిబుట్ కౌర్టోస్, జాన్ వెర్టోంగెన్, మౌరోనే ఫెల్లాని, థామస్ వర్మాలెన్, టోబీ ఆల్డర్‌వీల్డ్, యాన్నిక్ కరోస్కో, ఆక్సెల్ విజెల్,
రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, కెవిన్ డిబ్రుయెన్, నాసిర్ చాడ్లీ, రాబెర్టో మార్టినెజ్.

 

Posted in Uncategorized

Latest Updates