సెలవుపై ICICI బ్యాంకు సీఈవో చందా కొచ్చర్

iciciప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కీలక స్థానంలో ఉన్న ICICI లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వీడియోకాన్ ఇండస్ట్రీస్ కు రుణాలు మంజూరు చేయడంతో బ్యాంక్ ఎండీ , సీఈఓ చందాకొచ్చర్ ఏకపక్షంగా వ్యవహారించారనే ఆరోపణలతో బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిపై కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు సెలవులో పంపాలనే కొచర్ రిక్వెస్ట్ కు బోర్డు ఓకే చెప్పింది. ఇక బ్యాంక్ రోజువారీ వ్యవహారాలు చూసుకునేందుకు సందీప్ భక్షిని హోల్ టైమ్ డెరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ICICI గ్రూపులోని ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. మంగళవారం (జూన్- 19న) ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకు అన్ని వ్యాపారాలు, కార్పొరేట్‌ కేంద్రాల కార్యకలాపాలను ఆయన నిర్వహిస్తారు.

విచారణలో చందాకొచ్చర్ నిర్దోషిగా తేలితేనే తిరిగి బోర్డు పగ్గాలు దక్కించుకోగలుగుతారు. లేదంటే ఎండీ, సీఈఓ పదవులు వదులుకోక తప్పదు.

Posted in Uncategorized

Latest Updates