సెలవు ఇవ్వలేదని…. ఉన్నతాధికారినే చంపేశాడు

CRPFసెలవు ఇవ్వలేదన్న కోపంతో ఉన్నతాధికారిపై కాల్పులు జరిపాడు ఓ ఉద్యోగి. ఆదివారం(ఫిబ్రవరి25) ఉదయం మేఘాలయలోని సౌత్ వెస్ట్ కాశీ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) కానిస్టేబుల్ అర్జున్ దేశ్వాల్ తనకు సెలవు కావాలని అసిస్టెంట్ కమాండెంట్ ముఖేష్ సీ త్యాగిని అడిగాడు. అయితే దేశ్వాల్‌కు సెలవు ఇచ్చేందుకు త్యాగి అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన దేశ్వాల్ తన సర్వీస్ రైఫిల్‌తో త్యాగిపై 13 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో త్యాగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ జోగిందర్ కుమార్, ఎస్‌ఐ ఓం ప్రకాశ్ యాదవ్, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ మీనా లు తీవ్రంగా గాయపడ్డారు.  నిందితుడు అర్జున్ దేశ్వాల్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates