సెల్ఫీల హడావిడి.. గోవా బీచ్ లో ఇద్దరు గల్లంతు

bagaసెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ ఒక రోజు అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ.. స్మార్ట్ ఫోన్ నుంచి ఒక్క సెల్ఫీ క్లిక్ మనిపించకపోతే మాత్రం నిద్రపట్టదు కొందరు సెల్ఫీ ప్రియులకి. కొందరు అయితే వేగంగా వెళ్తున్న రైలుతో పరుగెత్తుతున్నట్లుగా సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సింహం, పులి లాంటి జంతువులతో సెల్ఫీకి ప్రయత్నాలు చేసి ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. ఈ సెల్ఫీ పిచ్చి మదిరిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలను నొ సెల్ఫీ జోన్ గా ప్రకటించేశారు కూడా. మన దేశంలో కూడా నో సెల్ఫీ జోన్లు ఉన్నాయి.

సెల్ఫీల హడావిడిలో పడి వెనుక నుంచి వస్తున్న అపాయాన్ని గమనించక గోవా బీచ్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. తమిళనాడులోని వేలూరుకి చెందిన దినేష్ కుమార్ రంగనాథన్(28) అనే యువకుడు ఆదివారం సాయంత్రం నార్త్ గోవాలోని బాగా బీచ్ లో మరో ఇద్దరు ఇతర టూరిస్టులతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున్న వచ్చిన అల దెబ్బకి  ముగ్గురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఇద్దరు మాత్రం ఎలాగోలా ఒయటపడ్డారు కానీ, దినేష్ మాత్రం సముద్రంలో మునిగి చనిపోయాడు. దినేష్ శవం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.

మరో ఘటనలో సింక్వేరిమ్ బీచ్ లో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెద్ద అల రావడంతో శశికుమార్ వాసన్(33) అనే వ్యక్తి సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Posted in Uncategorized

Latest Updates