సెల్ఫీ క్రేజ్…ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్ధులు

 సెల్ఫీ క్రేజ్ ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. సోమవారం కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. విద్యార్ధుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

బెంగళూరుకు చెందిన పూర్ణ చంద్ర, ముహ్మద్ ముర్తుజా, శశాంక్ లు కాలేజీలో చదువుతూనే జాతీయ సేవా పథకం వాలంటీర్లుగా సేవలందించేవారు. జాతీయ సేవా పథకం శిబిరంలో పాల్గోనేందుకు ముగ్గురు విద్యార్థులు బెంగళూరు సిటీకి దగ్గర్లోని దాబస్ పేటకు వెళ్లారు. శిబిరం ముగింపు సందర్భంగా దగ్గర్లోని చెరువు దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ముందుగా పూర్ణచంద్ర సెల్ఫీ దిగేందుకు ఫోన్ తీసుకొని నీళ్లలోకి దిగాడు. అతను నీళ్లలో మునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు ముర్తుజా, శశాంక్ లు కూడా నీళ్లలోకి దిగారు. ముగ్గురు నీటిలో మునిగిపోయి శవాలుగా మారారు.

.

Posted in Uncategorized

Latest Updates