సెల్ఫీ డెత్స్ : 259 మంది సెల్ఫీ తీసుకొంటూ చనిపోయారు

సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రదేశాలను నో సెల్ఫీ జోన్ లుగా కూడా ప్రకటించారు. అయితే ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా స్మార్ట్ ఫోన్ యూజర్లు సెల్ఫీ పిచ్చి మాత్రం వీడడం లేదు.రోజురోజుకు ఈ పిచ్చి పెరుగుతూనే ఉంది.

ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం..అక్టోబర్,2011 నుంచి నవంబర్,2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 259గా ఉంది. ఎత్తులో నుంచి కిందకి దూకుతున్నట్లు సెల్ఫీ కోసం ప్రయత్నించడం, రైలు వస్తుండగా సెల్ఫీ తీసుకోవడాని ప్రయత్నించడం ఇలాంటివి సెల్ఫీ మరణాలకు ప్రధాన కారాణాలుగా ఉన్నాయి. సెల్ఫీ మరణాల్లో అత్యధిక శాతం భారత్‌లోనే ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. భారత్ తర్వాతి స్థానంలో రష్యా, అమెరికా, పాకిస్థాన్ లు ఉన్నాయి. సెల్ఫీల కారణంగా మరణించిన వారిలో అత్యధికులు (72 శాతం) పురుషులు, అందులోనూ 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates