సెహ్వాగ్ ట్విట్టర్ మంటలు : అంపైర్స్.. బ్యాంక్ ఉద్యోగుల్లా వ్యవహరించారు

sehwagసెహ్వాగ్.. సోషల్ మీడియాలో వేసే పంచ్ లు పన్నీగా ఉంటాయి. ఒక్కోసారి సంచలనం కూడా. ఓ క్రికెట్ మ్యాచ్ – ఇండియన్ బ్యాంక్స్ లోని ఉద్యోగులకు లింక్ చేసి వేసిన ట్విట్ ఇప్పుడు మంటలు రేపుతోంది. సెహ్వాగ్ వర్సెస్ బ్యాంక్ మధ్య పోరు నడుస్తోంది. సౌతాఫ్రికాలో జరిగిన సెకండ్ వన్డేలో అంపైర్స్ వ్యవహరించిన తీరు తెలిసింది. మరో రెండు పరుగులు చేస్తే మ్యాచ్ కంప్లీట్ అవుతుంది. ఆ టైంలో.. అంపైర్స్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ.. ఇండియాలో బ్యాంకులు ఉద్యోగులు.. లంచ్ బ్రేక్ లో కస్టమర్లను పట్టించుకోకుండా వెళ్లిపోతారు.. వాళ్ల కోసం కామన్ మ్యాన్ గంటకొద్దీ నిరీక్షించాలి అంటూ పోలిక పెట్టి ట్విట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా బీభత్సం చేస్తోంది. జోకులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కస్టమర్లను ఎలా ట్రీట్ చేస్తారో.. ఇండియన్ ప్లేయర్స్‌ను.. అంపైర్లూ అలాగే చూశారని, లంచ్ కే బాద్ ఆనా అంటూ పంపించేశారని తనదైన స్టయిల్ లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన బ్యాంక్ ఉద్యోగులు సెహ్వాగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. సెహ్వాగ్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చిన్నబుచ్చుకున్నారు బ్యాంక్ ఉద్యోగులు. వీరూ సార్.. మేము కూడా బ్యాంకర్లమే.. కానీ ఎప్పుడూ కస్టమర్లతో అలా వ్యవహరించలేదు అంటూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు వీరూ కూడా రిప్లయ్ ఇచ్చాడు. మీరు మినహాయింపులేగానీ.. చాలా వరకు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సగటు జీవికి రోజూ ఎదురయ్యే అనుభవాలే కదా ఇవి అంటూ మళ్లీ హాట్ కౌంటర్ ఇచ్చాడు సెహ్వాగ్. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సెహ్వాగ్ వేసిన రీ కౌంటర్ కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates