సేఫ్టీ కోసం : బుల్లి ఫోన్లలోనూ GPS మస్ట్

feature phone_0

మీ చేతిలోని ఫోన్ చిన్నదైనా.. పెద్దదైనా ఏదైనా సరే GPS (గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్) కంపల్సరీ అంటోంది కేంద్రం. ఈ మేరకు అన్ని మొబైల్ ఫోన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఫ్యూచర్ ఫోన్ లో కూడా విధిగా GPS ఆప్షన్ ఉండాలని నిర్ణయించారు. దేశ భద్రతలో భాగంగా అమలు చేయబోతున్నారు. 2016లోనూ ఓసారి కేంద్రం ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో సాధ్యం కాదని సెల్ ఫోన్ తయారీ కంపెనీలు రిక్వెస్ట్ చేయటంతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం.

ఈసారి మాత్రమే మినహాయింపు లేదని స్పష్టం చేసింది కేంద్రం. అన్నీ డివైస్ ల్లో GPS ప్రొవిజన్, పానిక్ బటన్ తప్పనిసరిగా ఉండాలంటూ స్పష్టం చేసింది కేంద్రం. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ కూడా ఫ్యూచర్ ఫోన్లలో GPS ఉండాలని.. ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయంగా తెలిపింది. ఇక నుంచి తయారు చేసే అన్ని ఫ్యూచర్ ఫోన్లలోనూ GPS ఉండాలని.. వాటినే విక్రయించాలని కూడా తేల్చి చెప్పింది ప్రభుత్వం.

 

Posted in Uncategorized

Latest Updates