సేమ్ టూ సేమ్ : కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన అమిత్ షా

భీమా కోరెగావ్‌ హింస కేసులో ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహ నిర్బంధాన్ని నాలుగు వారాలు పొడిగించింది ఇవాళ(సెప్టెంబర్-28) సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. కాంగ్రెస్ పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ చీఫ్ అమిత్ షా. భారతదేశాన్ని ముక్కలు చేస్తామన్నవారికి మావోయిస్టులకు, నకిలీ ఉద్యమకారులకు కాంగ్రెస్ మద్దతిస్తోందని, మూర్కత్వానికి ఏదైనా ఒక స్థానం ఉందంటే అది కాంగ్రెసే అని, నిజాయితీ గల వాీళ్లను అవమానిస్తోందని అమిత్ షా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ కి స్వాగతం #భీమా కొరేగావ్ అంటూ షా ట్వీట్ చేశారు.

అయితే ఆగస్టు-28న కాంగ్రెస్ అధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ కూడా భీమా కొరేగావ్ కి సంబంధించి ఇలాంటి ట్వీటే చేశారు. భారతదేశంలో కేవలం ఒక NGOకు మాత్రమే స్థానం ఉందని, దానినే RSS అంటారని, మిగిలిన NGO లు అన్నింటినీ మూసివేయండి, ఫిర్యాదు చేసినవారిని కాల్చేయండి. నవ భారతానికి స్వాగతం, #భీమాకొరెగావ్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అమిత్ షా కూడా అదే పద్ధతిలో ఇవాళ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates