సేమ్ టూ సేమ్ : బ్యాంక్ వడ్డీ రేట్లు యథాతథం

Rbiరిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) బుధవారం(ఫిబ్రవరి-7) పాలసీ రివ్యూను ప్రకటించింది. త్రైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను ఏ మాత్రం మార్పు లేకుండా యథాతథంగా ఉంచింది. రెపోను 6.0శాతంగా, రివర్స్‌ రెపోను 5.75 శాతంగా ఉంచుతున్నట్టు తెలిపింది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో (MPC) ఐదుగురు యథాతథంగా ఉంచేందుకే ఓటు వేశారు. బ్యాంకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి RBI ఆఖరి మానిటరీ పాలసీ సమీక్ష ఇది. ధరల సూచీ.. డిసెంబర్లో 5.21 శాతంతో 17 నెలల గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న ముడి చమురు ధరలు RBI నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు..

 

 

Posted in Uncategorized

Latest Updates