సేమ్ టేస్ట్.. నో ఫ్యాట్ : కోడిని కోయకుండానే చికెన్

clean meat in labsచికెన్ కావాలంటే కోడిని కోయాలి.. మటన్ కావాలంటే గొర్రెను కోయాలి.. రక్తం చిందకుండా.. తల తెగకుండా ఈ రావు.. ఇప్పుడు మాత్రం ఆ అవసరం లేదు. కోడిని కోయకుండానే చికెన్, గొర్రెను చంపకుండానే మంటన్ కూడా వచ్చేస్తోందంట. అందుకు తగిన పరిశోధనలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా క్లీన్ మీట్ పేరుతో జరుగుతున్న ఈ పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. 2025 నాటికి ల్యాబ్ లో తయారయ్యే చికెన్, మటన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు.

హైదరాబాద్ సిటీలోని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషన్(HSI) దీనిపై పరిశోధనలు చేపట్టాయి. కోడి, గొర్రె నుంచి సేకరించిన కణాలతో.. లేబోరేటరీల్లో అభివృద్ది చేసే మాంసాన్నే క్లీన్ మీట్ అంటారు. ఎలాంటి బయాటిక్స్, గ్రోత్ హార్మోన్లు వాడకుండా దీనిని అభివృద్ది చేస్తున్నారు. దీన్ని క్లీన్ మీట్ గా నామకరణం చేశారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవ హింస ఉండదు. 2025 నాటికి ప్రయోగశాలల్లో అభివృద్ది చేసిన క్లీన్ మీట్ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

కొవ్వు లేని, బోన్ లెస్ మీట్ తయారు చేసి హైదరాబాదీలకు సరికొత్త రుచిని అందిస్తామంటోంది CCMB. సాధారణ మాంసం లాగే టేస్టుగా ఈ క్లీన్ మీట్ ఉంటుందా అన్న అనుమానం లేకపోలేదు. దీనిపై శాస్త్రవేత్తలు మాత్రం భరోసా ఇస్తున్నారు. సేమ్ టేస్ట్ వస్తుందని చెబుతున్నారు. సింధటిక్ టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా మాంసానికి పోషకాలను కూడా జోడించనున్నామని CCMB డైరక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.క్లీన్ మీట్ టెక్నాలజీలో విస్లవానికి నాంది పలికేందుకు CCMB, HIS సిద్దమయ్యాయని తెలిపారు. 2013లో మొదటిసారిగా క్లీన్ మీట్ ద్వారా బీఫ్ బర్గర్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన విషయం తెలిసిందే..

Posted in Uncategorized

Latest Updates