సేవా భోజ్ యోజన : అన్నదానం చేస్తే నో GST

ANNADANAM GSTఅన్నదానం చేస్తున్న వారికి కేంద్రం GST నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపంది కేంద్ర ప్రభుత్వం. నెలకు 5 వేల మందికి మించకుండా అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సేవా భోజ్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా అన్నదానం చేసే ఆధ్యాత్మిక సంస్థలకు కేంద్ర GST (CGST), సమీకృత GST( IGST) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది.

కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ.. నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురు ద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్‌ పోర్టల్‌ లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో  నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్‌ ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్‌ లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates