సైకిల్‌ పై ప్రపంచ యాత్ర : చరిత్ర సృష్టించిన భారత యువతి

సిడ్నీ: సైకిల్‌ పై ప్రపంచ యాత్ర చేపట్టి తొలి ఆసియా మహిళగా చరిత్ర సృష్టించింది భారత యువతి. పుణెకి చెందిన వేదాంగి కులకర్ణి(20) అనే యువతి అతి తక్కువ సమయంలో సైకిల్‌ పై ప్రపంచ యాత్ర పూర్తి చేసింది. 29వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కాల్సి ఉండగా.. ఆమె 14 దేశాల మీదుగా 139రోజులు సైకిల్ తొక్కింది. రోజుకు 300 కిలోమీటర్ల వరకూ ఆమె సైకిల్‌ పై ప్రయాణించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌ లో మొదలైన తన యాత్ర మళ్లీ అక్కడకి చేరుకోవడంతో ముగిసింది.

యూకేలో చదువుకుంటున్న వేదాంగి.. రెండేళ్ల నుంచే ఈ యాత్రకు సిద్ధమైంది. ప్రపంచ రికార్డు 38 ఏళ్ల బ్రిటిష్‌ సాహసి.. జన్నీగ్రాహం పేరు మీద ఈ ఏడాది నమోదైంది. ఆమె 124రోజుల్లోనే యాత్ర పూర్తి చేసింది. వేదాంగి తన 139రోజుల యాత్రలో.. 80శాతం ఒంటరిగానే యాత్ర చేపట్టింది.

 

Posted in Uncategorized

Latest Updates