సైకిల్ ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు: భార్యాభర్తలు మృతి


హర్యానా గుర్ గావ్ లో స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. సైకిల్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలను ఢీకొనడంతో.. స్పాట్ లో చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఉదయం 7 గంటల టైంలో స్కూల్ పిల్లలను ఎక్కించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. స్థానికులు బస్సును ధ్వంసం చేశారు. స్థానికుల ఆగ్రహంతో డ్రైవర్ పారిపోయాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. బస్సులో పిల్లలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందంటున్నారు స్థానిక ప్రజలు.

Posted in Uncategorized

Latest Updates