సైకిల్ పై నుంచి కిందపడ్డ MLA

రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ పై నుంచి కింద పడిపోయాడు. పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా పాట్నాలో గురువారం(జులై-26) ఆర్జేడీ ఆధ్వర్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్  సైకిల్ ర్యాలీ నిర్వహించారు.పార్టీ కార్యకర్తలతో కలసి ర్యాలీలో పాల్గొన్న తేజ్ ప్రతాప్ ఒక్కసారిగా సైకిల్ స్పీడ్‌ పెంచారు. అయితే టర్నింగ్ దగ్గర తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్  ను మరో వాహనం ఢీకొట్టింది. దీంతో సైకిల్ పై నుంచి కింద పడిపోయారు తేజ్ ప్రతాప్. అప్రమత్తమైన పోలీసులు…తేజ్ ప్రతాప్ యాదవ్ ను పైకి లేపారు. పైకి లేచిన తర్వాత తిరిగి ర్యాలీ కొనసాగించారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడిన తేజ్ ప్రతాప్ పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలకు నిరసనగా సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. మహువా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates