సైకిల్ పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేశారు

‘[హెల్మెట్‌ పెట్టుకోకపోయినా, బైకుపై వేగంగా వెళ్లినా ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్ వేస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సైకిల్ పై వెళ్తూ ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్ వేస్తారని మాత్రం మనకు తెలియదు. అతివేగంగా వెళ్తున్నాడని, హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వ్యక్తి రూ.2000 ఫైన్ వేశారు పోలీసులు.

ఉత్తర్‌ప్రదేశ్‌ కు చెందిన కసీమ్‌ అనే యువకుడు కేరళలోని కాసర్గూడ్ జిల్లాలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల మూడో తారీఖున  కంబాలా ప్రాంతంలో జాతీయ రహదారి గుండా సైకిల్‌ పై తాను పని చేస్తున్న చోటుకి వెళ్తున్న ప్లేస్ కి వెళ్తున్న కసీమ్ ని పోలీసులు ఆగాల్సిందిగా కోరారు. అతి వేగంగా వెళుతున్నావని, హెల్మెట్‌ కూడా లేదని రూ.2000 జరిమానా ఫైన్ వేశారు. అయితే  కసీమ్‌ కూలీగా పనిచేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు చివరకు రూ.500 జరిమానా విధించారు.  అంతేకాకుండా  సైకిల్ టైర్లలోంచి గాలి కూడా తీసేశారు.

పోలీసులు తన చేతిలో పెట్టిన చలానా కాగితాన్ని ఆ యువకుడు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అధికారులకు సమాచారం చేరింది. కసీమ్ కు వారు  రాసిచ్చిన చలాను కాగితాన్ని పరిశీలిస్తే అందులో ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నెంబరు ఉంది. ఆ వాహనం ఒక మహిళదని తెలిసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పోలీసుల తీరుపై నెటిజన్లు నెగిటీవ్ కామెంట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates