సైనికులకు సర్ ఫ్రైజ్ ఇచ్చిన ట్రంప్

ఇరాక్ : క్రిస్మస్ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ .. ఇరాక్ లో పని చేస్తున్న  US సైనికులను ఆశ్చర్యపరిచారు. క్రిస్మస్  అర్ధరాత్రి ఆయన ముందస్తు ప్రకటన లేకుండా ఇరాక్  వెళ్లారు. అక్కడ అమెరికా సైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరాక్ లో ట్రంప్ కు ఇదే తొలి పర్యటన. తన టూర్ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు ట్రంప్. ఈ టూర్ లో ఫస్ట్ లేడీ మెలానియా కూడా పాల్గొన్నారు.

అల్ -అసద్  ఎయిర్  బేస్ లో  సైనిక అధికారులతో భేటీ అయ్యారు ట్రంప్. మూడు గంటల పాటు అక్కడే ఉన్న ట్రంప్..సైనికులతో ఉల్లాసంగా గడిపారు. చాలా మంది సైనికులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఆటో గ్రాఫ్ లు  తీసుకొన్నారు.

Posted in Uncategorized

Latest Updates