సైనికులు నిల్చోని పహారా కాయాల్సిన అవసరం లేదు

దేశ సరిహద్దుల్లో 24 గంటల పాటు సైనికులు నిల్చుని పహారా కాస్తారు. కనురెప్పవాల్చకుండా ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షిస్తారు. అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనకాడరు జవాన్లు.అలాంటి సైనికులు బోర్డర్ లో ఇకపై నిల్చుని పహారా కాయాల్సిన అవసరం లేదని… కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్ శుక్రవారం తెలిపారు. అధునాతన సరిహద్దు నిర్వహణ వ్యవస్థను కేంద్రం అమలు చేయనుందని…దీంతో సరిహద్దు భద్రత మరింత పెరుగుతుందన్నారు. కొంతకాలం తర్వాత బోర్డర్ లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పాడైపోతుందని… దాని స్థానంలో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కమాండ్‌ కంట్రోల్ వ్యవస్థ ద్వారా సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలను గమనించవచ్చని… లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలిపారు కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్‌.

Posted in Uncategorized

Latest Updates