సైన్యం చేతిలో పాక్ PM కీలుబొమ్మ: ఇమ్రాన్ మాజీ భార్య

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇమ్రాన్ ఖాన్ పాక్ సైన్యం చేతిలో కీలు బొమ్మ అని రెహామ్ ఖాన్ అన్నారు. ఏం  మాట్లాడాలన్నా ఆయన సైన్యం వైపు చూస్తారని… మిలిటరీ ఆదేశాలు లేనిదే ఏమీ మాట్లాడలేని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ ఆరోపించారు.

పుల్వామా దాడిపై ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమేనన్నారు. తన స్పందన తెలిపేందుకు కూడా సైనికాధికారుల సూచనల కోసం వేచి చూశారని రెహమ్ ఖాన్ ఆరోపించారు. జరిగిన దాడిని ఖండించాల్సింది అనీ.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించకుండా.. ఎదురుదాడి చేస్తామనడం కరెక్ట్ కాదనీ విమర్శించారు.

Latest Updates