సైబర్ నేరగాళ్లు: సోషల్ మీడియాతో యూత్ కు గాలం

సైబర్ నేరగాళ్లు కొత్త రూట్లు ఎంచుకుని మరీ రెచ్చిపోతున్నారు. గతంలో ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోలతో మోసం చేసిన నైజీరియన్లు… ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా గాలం వేస్తున్నారు. యువతను టార్గెట్ చేసి అందిన కాడికి దోచేస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుఅదుపు లేకుండాపోతోంది. అమాయకులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, షేర్ చాట్, వాట్సప్, ట్విట్టర్ వంటి సైట్లలో పరిచయాలు పెంచుకుంటున్నారు. డాలర్లు, గిఫ్టుల ఆశచూపి లక్షలు స్వాహా చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కొంత మంది నైజీరియన్ గ్యాంగులు…. ఇక్కడి వారి అలవాట్లు, అభిరుచులు తెలుసుకుంటున్నారు. అందమైన యువకులు, అమ్మాయిల ఫోటోలతో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పరిచయం చేసుకుంటున్నారు. స్నేహం ముసుగులో ఆకర్షించి అందినకాడికి దోచుకుంటున్నారు. కొందరు నైజీరియన్లు 50 పౌండ్లు పంపుతున్నాం తీసుకోమని చెప్తున్నారు. ఇంతలో ఒకరు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి.. లండన్ నుంచి 50 పౌండ్ల పార్సిల్ వచ్చింది. అంటే అక్షరాల 45లక్షల ఇండియన్ రూపీస్. డబ్బులు కావాలంటే టాక్స్ పే చేయాలని చెప్పి లక్షల రూపాయలు వారి అకౌంట్లలో వేయించుకుంటున్నారు. తీరా బాధితులు ఫోన్ చేస్తే ఫోన్లు స్విచాఫ్ చేసేస్తున్నారు.

మరికొందరు నైజీరియన్లు రియల్ ఎస్టేట్, క్యాపిటల్ వెంచర్స్ లో పెట్టుబడి పెడతామని నమ్మించి.. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, ఆదాయం పన్ను పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులు పోలీసులకు వందళ్లో అందుతున్నాయి. హైదరాబాద్ లో బహుమతులు, డాలర్ల పేరుతో మోసం చేసిన కేసులు 2వందలకు పైగా నమోదయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates