సైబర్ నేరాలపై.. NTR, రాజమౌళి నటించిన షార్ట్ ఫిలిం రిలీజ్

19894754_1871773799755145_7137450189507618100_nదర్శకధీరుడు రాజమౌళి ఏం చేసిన.. అది ఒక సంచలనంగా మిగులుపోతుంది. అయన సినిమాల్లో అద్భుతాలు చూపిస్తారు. అలాగే కొన్ని సినిమాల్లో రాజమౌలి కొన్నిసార్లు కామియో రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో క్రేజీ కాంబినేషన్ ఎన్టీఆర్, రాజమౌళి కలిసి ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు. హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీరిద్దరినీ పెట్టి షార్ట్ ఫింలిం తీశారు. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించారు.
సిటీ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఫిల్మ్ సోమవారం (ఫిబ్రవరి-19) నుంచి థియేటర్లతో పాటు సోషల్‌ మీడియా ద్వారా ప్రజల మధ్యకు వెళ్లనుంది. సోమవారం (ఫిబ్రవరి-19) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ వి.వి.శ్రీనివాసరావు PVR సినిమా థియేటర్‌ లో దీన్ని విడుదల చేశారు. రోజుకో రకంగా వెలుగుచూస్తున్న సైబర్‌ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు యాడ్‌ ఫిలింలో నటించారు NTR, రాజమౌళి.

 

Posted in Uncategorized

Latest Updates