సొంత ఫ్లాట్ కొనాలనుకుంటే….డెస్టినేషన్ గా సిటీ ఔట్ స్కట్స్

ప్రతీ ఒక్కరి జీవితంలో సొంతిళ్లు అనేది ప్రధాన లక్ష్యం.. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ కి సొంతింటి కళ అనేది లైఫ్ టైమ్ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు.. ఎంతో కొంత సంపాదించి సొంతంగా చిన్న ఇళ్లైనా కొనుగోలు చేయాలనే ధ్యేయంగా ముందుకెళ్తారు.. సంపాదనలో ఇల్లు కొనడానికి ఎంతో కొంత డబ్బును సేవ్ చేసుకుంటారు.. కానీ రోజురోజుకీ హైదరబాద్ లో పెరుగుతున్న రేట్లతో సిటీలో ఇళ్లు కొనడం గగనంగా మారుతోంది.. సొంత ఫ్లాట్ కొనుకోవాలనుకునేవారికి సిటీ ఔట్ స్కట్స్ మాత్రమే డెస్టినేషన్ గా మారాయి.

దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. సిటీలో ఉంటూ ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడాలనుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగడంతో ఇళ్ల ధరలు పెరిగాయి. నాలుగేళ్ల క్రితం సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో 30 నుంచి 35 లక్షలలోపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, 35 లక్షల నుంచి 50 లక్షలలోపు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లభించేవి..కానీ ప్రజెంట్ సిటీలో ఫ్లాట్స్ తీసుకోవాలంటే కామన్ మ్యాన్ కి అందుబాటులో లేకుండా పోయింది.

ప్రస్తుతం మిడిల్ క్లాస్ పీపుల్ ఫ్లాట్ కొనాలంటే సిటీ ఔట్ స్కట్స్ వైపు చూడక తప్పడం లేదు. 50 లక్షలలోపు ఫ్లాట్ కావాలంటే ప్రస్తుతం డెవలప్ అవుతున్న ఏరియాల్లో మాత్రమే చూసుకోవాల్సి వస్తోంది. గతంలో గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ లాంటి ఏరియాల్లో 50 లక్షల లోపు అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్స్ దొరికేవి.. కానీ ప్రజెంట్ ఈ ఏరియాలో ఐటీ భూమ్ పెరిగిపోవడంతో మిడిల్ క్లాస్ పీపుల్ అటువైపు చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

సిటీలో అపార్ట్ మెట్ల ధరలు పెరగడానికి ల్యాండ్ రేట్స్ పెరగడమే కారణమంటున్నారు డెవలపర్స్. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే భూముల ధరలు మూడంతలు పెరిగాయంటున్నారు. కన్ స్ట్రక్చన్ మెటీరియల్స్ స్టీల్, ఇసుక, సిమెంట్ ఇలా అన్నింటి ధరలు పెరగడం కూడా మరో కారణమని చెబుతున్నారు.

ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదీగూడ, నారపల్లి, మేడిపల్లిలో అఫర్డబుల్ ఫ్లాట్స్ ఉన్నాయంటున్నారు డెవలపర్స్. ఈ ఏరియాల్లో 40 లక్షల్లో డబుల్ బెడ్రూమ్స్, 50 లక్షల్లో త్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయంటున్నారు. ఇక వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, తుర్కయాంజాల్ వరకు అందుబాటు ధరల్లో ఫ్లాట్స్ ఉన్నాయంటున్నారు.
హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా మారుతూ అర్బనైజేషన్ కూడా పెరగుతుండటంతో ఫ్యూచర్ లో ధరలు మరింతగా పెరగుతాయని.. అఫర్డేబుల్ ఇళ్లు కొనడానికి ఇదే మంచి సమయముంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates