సోనాక్షికి షాక్.. హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఏం పంపారో తెలుసా?

ఈ కామర్స్ సైట్లలో ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు,ఇటుకలు,రాళ్లు,పళ్లు వచ్చిన సంఘటనలు మనం ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఒకటి బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ఎదురైంది. ఆమె రీసెంట్ గా ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో బోస్ హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరిలో ఆమెకు హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుము వస్తువు వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సోనాక్షి ఆ విషయాన్ని ఫోటోలతో సహా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ఆమె అమెజాన్ ను కూడా ట్యాగ్ చేశారు.

‘హే అమెజాన్‌.. నేను బోస్‌ హెడ్‌ఫోన్స్‌ ఆర్డర్‌ చేస్తే ఏం వచ్చిందో చూడు. బాక్స్‌ ఓపెన్‌ చేసి చూస్తే లోపల ఈ ఇనుము వస్తువు ఉంది. ఇదే విషయాన్ని మీ కస్టమర్‌ సర్వీస్‌కు కాల్ చేసి చెప్దామనుకుంటే వారు నాకు సహాయం చేయాలి అనుకోలేదు.. అది ఇంకా ఘోరమైన విషయం’ అని సోనాక్షి అన్నారు. ‘ఎవరైనా ఈ చెత్తను రూ.18 వేలు పెట్టి కొంటారా.. (ఇది ఇనుము). బాధపడకండి. నేను దీనిని అమ్ముతాను. కానీ అమెజాన్‌లో మాత్రం కొనకండి. అప్పుడే మీరేం ఆర్డర్‌ చేస్తే అదే వస్తుంది’ అంటూ సోనాక్షి మరో ట్వీట్‌ కూడా చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates