సోనాలి ట్విట్ : కుమారుడిపై ఎమోషనల్ లెటర్

నటి సోనాలిబింద్రే హై గ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తెలిపిన సోనాలి..తన హెయిర్ స్టైల్ ను కట్ చేసిన పిక్ ను కూడా పోస్ట్ చేశారు. అయితే ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తన కొడుకు చెప్పిన విషయాన్ని గురువారం (జూలై-19) ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు సోనాలి.

తన కొడుకు 12 సంవత్సరాలుగా నా మంచి చెడులకు జవాబుదారీగా ఉన్నాడని.. వాడు పుట్టినప్పటి నుంచి నేను, నా భర్త గోల్డి బెహల్ వాడి సంతోషం, శ్రేయస్సే లక్ష్యంగా ఏ పనైనా చేశామని తెలిపారు. నాకు ఈ వ్యాధి గురించి తెలిసినప్పటి నుంచి వాడికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలనే డైలమాలో మేము పడిపోయామన్నారు. వాడిని కాపాడుకోవాలంటే నిజాలన్నీ చెప్పటం ముఖ్యం. మేము ఎప్పుడు వాడి దగ్గర నిజాయితీగా ఓపెన్‌ గా ఉండాలి. సో చెప్పేశాం అన్నారు.

ఈ వార్తను చాలా మెచ్యూర్‌ గా స్వీకరించాడు. అప్పటి నుంచి నాకు తను ఓ బలంగా, పాజిటివిటీగా మారిపోయాడు. అప్పుడప్పుడు తను ఓ తల్లిగా మారి నా పనులను చూస్తుంటాడు. పిల్లలను ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ చేయడం అత్యవసరమని నేను నమ్ముతాను. మన జబ్బును దాచుకోవడం కన్నా వారిని దీనిలో భాగస్వామిని చేసి, వారితో సమయం గడపడం ముఖ్యం. ఇలా చేయడం వలన వారిని బాధ నుంచి రక్షించుకోవడమే కాకుండా.. జీవితంలోని రియాలిటీస్‌ ని వాళ్లకు పరిచయం చేసిన వాళ్లమవుతాం. నేను ప్రస్తుతం నా సమయం మొత్తం నా కొడుకు రణవీర్‌ తో గడుపుతున్నాను. వాడికి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అంటూ చెప్పుకొచ్చారు సోనాలి. దీనిపై సోషల్ మీడియాలో ఆమె చేసిన పనికి పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అందరం చనిపోయేవారిమేనని, కాస్త ..వెనకా ముందు అంతే తేడా అంటూ సోనాలికి ధైర్యం చెబుతున్నారు నెటిజన్స్.

Posted in Uncategorized

Latest Updates