సోనాలి బింద్రే న్యూ లుక్…స్పందించిన ఆనంద్ మహీంద్రా

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే(43) కేన్సర్ వ్యాధితో భాధపడుతున్న విషయం తెలిసిందే. తనకు క్యాన్సర్ వచ్చిందని, న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్వయంగా సోనాలి చెప్పింది. ట్రీట్ మెంట్ కోసం తన హెయిర్ ను కట్ చేయించుకుంది సోనాలి బింద్రే. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన సోనాలి తన భర్త తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలియజేసేలా ఉన్న ఓ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సోనాలి బింద్రే….ఈ విశాల ప్ర‌పంచంలో నేను ఒంట‌రిదాన్ని కాద‌నే భావ‌న నాలో కొత్త ఆశ‌ల‌ను క‌లిగిస్తోంది. నా కోసం ప్రార్ధించిన అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు. మ‌నుగ‌డ సాగించేందుకు మాన‌వులు చేసే ప్ర‌య‌త్నం అద్భుతమైనవి. క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడే మ‌న‌లో దాగి ఉన్న శ‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడే మనమెంత ధైర్యవంతులమో మ‌న‌కు తెలుస్తుందని ఆ పోస్ట్ లో తెలిపింది.

సోనాలి పోస్ట్ పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సోనాలి… నువ్వు త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతావ్ అంటూ, మేమందరం నీవెంట ఉన్నాం.. ఏం భయపడకు అంటూ సోనాలిని ఓదారుస్తున్నారు. సోనాలి పోస్ట్ పై మహీంద్రా సీఈవో… ఆనంద్ మహీంద్రా స్పందించారు. నీలో దాగి ఉన్న మానసిక బలం, పాజిటివిటీ న్యూ లుక్‌ లో వెలిగిపోతుంది సోనాలీ,  మీరు పైకి ఎదగడానికి కింద పడుతున్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ట్వీట్ చేశారు. అనేక మంది సెలబెట్రీలు కూడా సోనాలికి ధైర్యం చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates