సోమనాథ్ ఛటర్జీకి తెలంగాణ శాసనమండలి సంతాపం

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల సంతాపం ప్రకటించింది తెలంగాణ శాసనమండలి. సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల సీఎం కేసీఆర్ మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సీపీఐ(ఎం) అగ్ర నాయకుడైన ఛటర్జీ బడుగు, బలహీన వర్గాలకు అనేక సేవలందించారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొట్టమొదటి కమ్యూనిస్టు నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు కేసీఆర్. లోక్‌సభకు ఛటర్జీ 10 పర్యాయాలు ఎన్నికయ్యారు. సోమనాథ్ ఛటర్జీతో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సోమనాథ్ సూచించారని గుర్తు చేశారు. సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates