సోమవారం సీఎంగా ప్రమాణం చేస్తా : కుమారస్వామి

MUDకర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాని కలిశారు కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరామన్నారు. సోమవారం(మే-21) ఉదయం  ప్రమాణస్వీకారం చేసేందుకు గవర్నర్ ఆహ్వానించారన్నారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలోనే సోమవారం ఉదయం 12 గంటల సమయంలో తన ప్రమాణస్వీకారం ఉంటుందని కుమారస్వామి తెలిపారు. 15 రోజుల్లో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని తెలిపారు. తనకు ఐటీ, ఈడీ ల గురించి భయమే లేదన్నారు. తన ప్రమాణస్వీకారానికి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇతర జాతీయనేతలు హాజరౌతారని కుమారస్వామి తెలిపారు. అన్నీ ప్రాంతీయ పార్టీల నేతలను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బెంగాల్ సీఎం మమతా ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీ కార్యకర్తలకు కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates